logo

header-ad
header-ad

'ఓ మై గాడ్' సీక్వెల్‌లో యామీ గౌతమ్..?

2012 లో వచ్చి సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' సినిమా సీక్వెల్‌కి బాలీవుడ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సీక్వెల్‌లో కొత్త పెళ్ళికూతురు యామీ గౌతమ్ నటించే అవకాశాలున్నాయని తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అక్షయ్ కుమార్, పరేశ్ రావల్ ముఖ్య పాత్రల్లో ఉమేశ్ శుక్లా తెరకెక్కించిన 'ఓ మై గాడ్' మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లోనే దీనికి సీక్వెల్ రూపొందిస్తారని ప్రచారం జరిగింది. ఎట్టకేలకి ఇన్నాళ్ళు సీక్వెల్ ప్లాన్స్ మొదలయినట్టు బీ టౌన్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్‌లో అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా, పంకజ్ త్రిపాఠీ భక్తుడిగా కనిపిస్తాడట. పంకజ్ త్రిపాఠీకి జంటగా  ఇటీవల డైరెక్టర్ ఆదిత్య దర్‌ని పెళ్లాడిన యమీ గౌతమ్ నటించబోతున్నాట్టు తెలుస్తోంది. కాగా ఈ సీక్వెల్‌కి ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించడం లేదట. దర్శకుడు, ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ త్వరలో వెలువడనుందని సమాచారం.

Source: https://www.andhrajyothy.com/telugunews/https://www.andhrajyothy.com/telugunews/yami-gowtham-in-oh-my-god-sequal-chj-grk-1921061011063334-chj-grk-1921061011063334

Leave Your Comment