logo

header-ad
header-ad

రైల్వే ట్రాక్‌పై ప్రత్యక్షమైన యముడు… డేంజరే మరీ !

మహారాష్ట్రాలోని అందేరి రైల్వే స్టేషన్‌లో జరిగిన ఓ సంఘటన అందరిని భయాందోళనకు, ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. యమలోకంలో ఉండే యముడు రైలుపట్టాలపై ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు..మనుషుల్ని తన భుజాలపై ఎత్తుకెళ్తూ కనిపించాడు. ఆ దృశ్యాలను చూసిన వారంతా  అక్కడ ఏం జరుగుతుందో అర్ధంకాక అయోమయంలో పడ్డారు. కానీ, అదంతా నిజం కాదని తెలిసిన తర్వాత  ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే, అక్కడ జరిగినదంతా ఓ అవగాహన కార్యక్రమమేనట. రైల్వే అధికారులే స్వయంగా ఈ ఎవర్నేస్‌ ఏర్పాటు చేశారు.

దాదాపు చాలా  చోట్ల ప్రయాణికులు రైల్వే క్రాసింగులు, ట్రాకులు నేరుగా దాటేస్తుంటారు. ప్రయాణికుల కోసం ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించినా వాటిని వినియోగించుకోవటానికి చాలా మంది బద్దకిస్తుంటారు. దీంతో  పలుమార్లు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కొల్పోతున్నారు. ఇటువంటి సంఘటనలను అరికట్టేందుకు అక్కడి రైల్వే అధికారులు ఇటువంటి వినూత్న విధానాన్ని అమలు చేశారు. యమధర్మరాజు వేషధారణలో ఉన్న ఓ బలమైన వ్యక్తి  రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న వారిని అమాంతం ఎత్తుకెళ్తాడు…ఈ క్రమంలోనే ప్రమాదహెచ్చరికలు,నిబంధనలు పాటించవారు నేరుగా యమలోకానికే వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించాడు. రైలు ప్రమాదాలపైన ప్రయాణికులు, సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించే దిశగానే తమ ప్రయత్నం అన్నారు అధికారులు. రైల్వేశాఖ చేపట్టిన ఎవర్నేస్‌ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

Source: https://tv9telugu.com/yamadrama-at-railway-station-for-safety-awareness-158357.html

Leave Your Comment