logo

header-ad
header-ad

తెరుచుకున్న యాదాద్రి ఆలయం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల దర్శించుకుంటున్నారు.

ఈ ఉదయం నుంచి భక్తలకు అనుమతి ఇచ్చారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత మూడు రోజుల పాటు దేవాదాయశాఖ అధికారులు భక్తుల దర్శనాలకు అనుమతిని నిలిపివేశారు. ఈరోజు యధావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతినిచ్చారు.

కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండటంతో ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసివేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి స్వామివారి కైంకర్యాలను ఏకాంతంగానే నిర్వహించారు. భక్తులెవరూ ఆలయానికి అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ఆలయంలోని ప్రధానార్చకులతో పాటు మరో ఇద్దరు అర్చకులు, సిబ్బందికి పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆలయాన్ని పూర్తిగా శానిటైజేషన్ చేశారు. ఇబ్బంది ఉండకుండా ముందు జాగ్రత్తగా మూడు రోజులు మూసివేయాలని నిర్ణయించారు. కాగా ఆలయంలో కరోనా విజృంభించడంతో స్థానికులతో పాటు భక్తుల్లో ఆందోళన మొదలైంది.

Source: https://tv9telugu.com/yadadri-sri-lakshmi-narasimha-swamy-temple-reopened-after-three-days-311005.html

Leave Your Comment