logo

header-ad
header-ad

మరింత దిగజారిన టోకు ధరల సూచీ

న్యూఢిల్లీ:  టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం  నవంబరు   మాసానికి 0.58 శాతంగా నమోదైంది.   ప్రధానంగా ఆహార  ధరలు కొండెక్కడంతో అక్టోబర్‌లో 0.16గా ఉన్న టోకు ధరల సూచీ మరింత  దిగజారింది.   కూరగాయల ద్రవ్యోల్బణం 45.32గా  వుంది. గత నెలలో ఇది 38.91గా ఉంది.  ఈ గణాంకాలు వెలువడిన వెంటనే కీలక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో 100పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్‌ వెంటనే ఫ్లాట్‌గా మారింది. ప్రస్తుతం 54 పాయింట్లు నష్టంతో ట్రేడ్‌ అవుతోంది.  అటు  ఆరంభంలో 8 పైసలు ఎగిసిన రూపాయి కూడా  నష్టాల్లోకి మారింది.

Source: https://www.sakshi.com/news/business/wpi-inflation-nov-stood-058-percent-1248383

Leave Your Comment