logo

header-ad
header-ad

No Sex On Christmas: ఆ మూడు రోజులు దగ్గరికి రానివ్వరు... అవి ముగిసాక ఆలుమగలకు పండుగే..

No Sex On Christmas: విదేశాలలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. డిసెంబర్ నెల ప్రారంభంలోనే మొదలయ్యే క్రిస్మస్ వేడుకలు.. కొత్త ఏడాది సంబురాలు ముగిసేదాకా కొనసాగుతాయి. చాలా దేశాలలో క్రిస్మస్ కు సుమారు 15 రోజుల నుంచి 20 రోజుల దాకా సెలవులుంటాయి. అయితే ఇంత ఖాళీ దొరికినా.. సెలవుల్లో మాత్రం జంటలు సెక్స్ లో పాల్గొనవట. కానీ అవి ముగిసి కొత్త ఏడాది లోకి అడుగు పెట్టేముందు రాత్రంతా జాగారాలేనట.

క్రిస్మస్ ప్రేమకు, ఆనందానికి ప్రతిరూపం కావొచ్చు గానీ ఆలుమగలకు ఆ విషయంలో మాత్రం కాదట. విదేశాలలో క్రిస్మస్ సందర్భంగా జంటలు సెక్స్ చేసుకోవట. క్రిస్మస్ ఘనంగా జరిగే మూడు రోజుల పాటు చాలా మంది మహిళలు వారి భర్తలను దగ్గరకు కూడా రానివ్వరట. కాలిఫోర్నియా లోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఈ సర్వేలో యూకే, యూఎస్, ఫ్రాన్స్, బ్రెజిల్ నుంచి సుమారు 5 లక్షల మంది మహిళలు పాల్గొన్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు అధ్యయనవేత్తలు.

మాములుగా బ్యాంకు సెలవులు, వాలైంటైన్స్ డే సమయంలో విరివిగా సెక్స్ చేసుకునే జంటలు.. క్రిస్మస్ సెలవుల్లో మాత్రం అందుకు దూరంగా ఉంటాయట. ముఖ్యంగా డిసెంబర్ 25 నుంచి మూడు రోజుల దాకానైతే అసలు దాని ఊసే ఎత్తరట.

కానీ ఈ మూడు రోజులు ముగిసిన తర్వాత మాత్రం ఇక వారికి ప్రతి రాత్రి జాగారమేనట.. ముఖ్యంగా న్యూఈయర్ లో అయితే జంటలు సెక్స్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాయట.

ఇదే విషయమై ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ డాక్టర్ జాక్వి గబ్ స్పందిస్తూ... ‘క్రిస్మస్ సందర్భంగా జంటలు లైంగిక వాంఛలను పూర్తిగా అణుచుకుంటాయి. ఆ మూడు రోజుల్లో మహిళలు ఎక్కువగా కుటుంబ పనులను వారి భుజాలపై వేసుకుంటారు. బంధువులకు బహుమతులు చుట్టడం, షాపింగ్ చేయడం, ఆహారాన్ని ప్రిపేర్ చేయడం, ఇంటితో పాటు క్రిస్మస్ ట్రీని అలంకరించుకోవడం వంటివి చేస్తాయి.’ అని తెలిపారు.

ఇక బాక్సింగ్ డే (డిసెంబర్ 26) ముగియగానే జంటలు యధావిధిగా శృంగారంపై ఆసక్తి చూపిస్తాయని సర్వేలో తేలింది. ముఖ్యంగా డిసెంబర్ 31 అర్థరాత్రి పూట తప్పకుండా లైంగికంగా కలుస్తారని న్యూయార్క్ కు చెందిన చాలామంది తెలిపారు. న్యూఈయర్ డేను సెక్స్ లాగిన్ డే గా మారుస్తారట.

Source: https://telugu.news18.com/photogallery/life-style/women-have-less-sex-in-christmas-but-peak-on-new-year-study-reveals-ms-708180-page-6.html

Leave Your Comment