logo

header-ad
header-ad

300 మంది డ్యాన్సర్స్‌తో...

కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. బాలీవుడ్‌ కథానాయిక జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ప్రత్యేకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవలె జరిగిన షెడ్యూల్‌లో కిచ్చాసుదీప్‌, జాక్వెలిన్‌పై ఓ పాట, కీలక సన్నివేశాలను చిత్రబృందం తెరకెక్కించింది. ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో 300 మంది డ్యాన్సర్‌తో జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఈ పాటను తెరకెక్కించారు. ఈ సందర్భంగా జాక్వెలిన్‌ మాట్లాడుతూ‘‘విక్రాంత్‌ రోణ’ చాలా స్పెషల్‌ మూవీ. ఈ ప్రపంచానికి ప్రత్యేకమైన భారతీయ కథను పరిచయం చేయబోతున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రంలో భాగంకావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘చిత్ర యూనిట్‌లో ఎనర్జీకి కారణమైన జాక్వెలిన్‌కు ఽథాంక్స్‌. మీ డాన్స్‌ నాలో ఎనర్జీని రెట్టింపు చేసింది’’ అని సుదీప్‌ చెప్పారు. ‘‘జాక్వెలిన్‌ చాలా ప్రొఫెషనల్‌ నటి. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పనున్నారు’’ అని నిర్మాత జాక్‌ మంజునాథ్‌ తెలిపారు. అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నీతా అశోక్‌ కథానాయిక. 

Source: https://chitrajyothy.com/telugunews/with-300-dancers-1921072104045472

Leave Your Comment