logo

header-ad
header-ad

వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్..

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ రోజురోజుకు సరికొత్త అప్డేట్స్‌తో యాజర్ల ముందుకొస్తుంది. వాట్సాప్ యాప్ మొబైల్ వెర్షన్ లాగే త్వరలో వాట్సాప్ వెబ్‌ వెర్షన్కు కూడా వాయిస్, వీడియో కాల్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాన్నట్లు తెలుస్తోంది. నూతనంగా విడుదలకానున్న వాట్సాప్ వెబ్ 2.2043.7 వెర్షన్‌లో ఈ కొత్త అప్డేట్‌ను చేర్చనున్నట్లు WABetaInfo నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న ఈ ఫీచర్, రాబోయే కొద్ది వారాల్లోనే వాట్సాప్ వెబ్ యూజర్లకు అందించడానికి ఆలోచిస్తున్నట్లు నివేదిక తెలిపంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను యూజర్స్‌తో పంచుకుంది WABetaInfo.

యూజర్‌కు కాల్ వచ్చినప్పుడు విండో పాప్-అప్ అవుతుందని తెలుస్తుంది. వాట్సాప్ వెబ్ యూజర్కు ఇన్కమింగ్ కాల్‌ వచ్చినప్పుడు యాక్సెప్ట్, డిక్లైన్, ఇగ్నోర్ వంటి ఆప్షన్స్‌తో చిన్న 'ఇన్‌కమింగ్ కాల్' విండో డిస్‌ప్లే అవుతుంది. ఈ ఇన్‌కమింగ్ కాల్ విండోలో కాలర్ యొక్క చిత్రం కూడా కన్పిస్తుంది. అదే అవుట్ గోయింగ్ కాల్స్ విషయానికి వస్తే పాప్-అప్ విండోలో కాల్ స్టేటస్ అనగా- కాలింగ్, రింగింగ్, ఇన్-కాల్ టైమర్ వంటివి చూపిస్తుంది. ఈ నూతన అప్డేట్ ద్వారా వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ కూడా అందుబాటులో రానుందని WABetaInfo నివేదిక పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుండి వాట్సాప్ వెబ్‌లో వాయిస్ మరియు వీడియో కాల్‌ సపోర్ట్‌కు చాలా డిమాండ్ ఉంది. అయితే, ఈ నూతన ఫీచర్‌ను యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుందనే విషయాన్ని వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ ఇంకా అధికారికంగా పంచుకోలేదు. అయితే, ఇన్ యాప్ సపోర్ట్ మరియు మ్యూట్ చాట్ ఫరెవర్ వంటి కొత్త ఫీచర్లను మాత్రం పరీక్షిస్తున్నట్లు ఇటీవల వాట్సాప్ తన నివేదికలో స్పష్టం చేసింది. కాగా, వాట్సాప్ తన యూజర్స్ నుంచి గతంలో అభిప్రాయాలను స్వీకరించింది. వారి అభిప్రాయాలకు అనుగుణంగా కొత్త కొత్త అప్డేట్స్‌తో ముందుకొస్తుంది.

Source: https://telugu.news18.com/news/technology/whatsapp-web-is-getting-voice-and-video-calls-soon-will-you-still-use-zoom-google-meet-ss-gh-638400.html

Leave Your Comment