logo

header-ad
header-ad

WhatsApp: ఈ మూడు ఫీచర్స్ వచ్చాయంటే మీ వాట్సప్ అదుర్స్

వాట్సప్... ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కోట్లాది మంది ఉపయోగిస్తున్న యాప్ ఇది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకోవడం వాట్సప్ ప్రత్యేకత. త్వరలో మరిన్ని ఫీచర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. వాటిలో మూడు ఫీచర్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. వాట్సప్‌కు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని ప్రపంచానికి ముందే చెప్పే WABetaInfo ప్రకారం త్వరలో వాట్సప్‌లో అడ్వాన్స్ సెర్చ్, బ్యాకప్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, ఆటో డౌన్‌లోడ్ రూల్స్ ఫీచర్స్ రానున్నాయి. మరి వాటి ఉపయోగాలేంటో తెలుసుకోండి.

Advance Search: మీకు వాట్సప్‌లో మెసేజెస్, ఫోటోస్, వీడియోస్, గిఫ్ ఫైల్స్ వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమైపోతుంది. అందుకే అడ్వాన్స్ సెర్చ్ ఫీచర్‌ని రూపొందిస్తోంది వాట్సప్. మీకు వచ్చిన మెసేజ్‌ను అక్కడే సెర్చ్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Backup Password Protection: గూగుల్ డ్రైవ్‌లోని మీ ఛాట్ బ్యాకప్స్‌కి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఛాట్ బ్యాకప్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ కనిపించనుంది. మీరు ఈ ఫీచర్ ఆన్ చేస్తే మీ ఛాట్ బ్యాకప్స్ అన్నీ పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ అవుతాయి. దీని వల్ల మీ ప్రైవసీ కూడా పెరుగుతుంది. మీ మెసేజెస్ ఇతరులు చదువుతారన్న భయం ఉండదు.

Auto Download Rules: వాట్సప్‌లో ఫార్వర్డ్ మెసేజెస్ కుప్పలుతెప్పలుగా వస్తుంటాయి. వీటిలో అవసరం లేని ఫోటోలు, వీడియోలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువగా ఫార్వర్డ్ అయ్యే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్ మెసేజెస్ ఆటో డౌన్‌లోడ్ కాకుండా డిసేబుల్ చేసే ఆప్షన్ త్వరలో వాట్సప్‌లో రానుంది.

Source: https://telugu.news18.com/news/technology/whatsapp-to-release-advance-search-backup-password-protection-auto-download-rules-features-soon-ss-493076.html

Leave Your Comment