logo

header-ad
header-ad

దిశ ఘటన: నెంబర్‌ను బ్లాక్‌ చేసిన వాట్సాప్ సంస్థ

సైబరాబాద్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్‌ను ఆ సంస్థ బ్లాక్ చేసింది. దిశ హత్యాచార ఘటన అనంతరం.. పోలీసులు.. మహిళల కోసం.. ‘94906 17444’ ప్రత్యేకమైన ఫోన్ నెంబర్‌ను కేటాయించిన విషయం విదితమే. అయితే.. ఈ నెంబర్‌కు ప్రాంతాల వారీగా.. మెసేజ్‌లు ఒకేసారి వెల్లువెత్తాయి. ఈ మెసేజ్‌ల పట్ల అనుమానం వ్యక్తం వాట్సాప్ సంస్థ చేసింది. అంతేకాకుండా.. అపరిమిత సంక్షిప్త సమాచారం కూడా వస్తుండటంతో.. వాట్సాప్ సంస్థ.. ఈ నెంబర్‌ను నిలిపివేసింది. ఇట్పివరకూ ఈ నెంబర్‌కి 5 లక్షలకు పైగా మెసేజ్‌లు వచ్చాయి.

ఈ విషయంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించాలని.. వాట్సాప్‌ యాజమాన్యానికి మెయిల్ పెట్టారు. అలాగే.. కొత్త వాట్సాప్‌ నంబర్‌ను ఇచ్చారు. మహిళల సమస్యలను న్యూ వాట్సాప్‌ నంబర్‌ ‘79011 14100’కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

Source: https://tv9telugu.com/whatsapp-company-block-the-cyberabad-phone-number-170657.html

Leave Your Comment