logo

header-ad
header-ad

వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. “ఇక ఇలా చేయవచ్చు”

WhatsApp Payment Service: వాట్సాప్ వినియోగదారులకుపెద్ద గుడ్ న్యూస్. ఇక ముందు  వాట్సాప్ ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమతి వచ్చిన విషయంను ఫేస్‌బుక్ సీఈవో జుక‌ర్‌బ‌ర్గ్ ఈ ప్ర‌క‌టించారు.

వాట్సాప్‌లో డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దీంతో నేటి నుంచి వాట్స‌ప్‌లో సుర‌క్షితంగా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని వాట్సప్ వినియోగ‌దారులంద‌రికీ డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి.

‌వాట్సప్ ద్వారా చేసే చెల్లింపుల‌కు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని జుక‌ర్ బ‌ర్గ్ స్ప‌ష్టం చేశారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, సుర‌క్షితంగా ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు.

ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ తన పేమెంట్‌ సర్వీసును దేశీయంగా ప్రారంభించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ( NPCI) గురువారం అనుమ‌తిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు గ్రేడెడ్‌ విధానంలో వాట్సాప్‌ తన సర్వీసులను ప్రారంభించనుంది.

వాట్సాప్‌ గత రెండేళ్లుగా తన యూపీఐ ఆధారిత పేమెంట్‌ పైలెట్‌ సర్వీసును నడుపుతోంది. కానీ డేటా లోకలైజేషన్‌ అవసరాల కారణంగా అధికారికంగా అనుమతి లభించలేదు. తాజాగా ఎన్‌పీసీఐ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

Source: https://tv9telugu.com/whatsapp-announced-the-roll-out-its-payments-services-in-india-following-approval-343138.html

Leave Your Comment