చెన్నై: తమిళంతో పాటు తెలుగుభాషలోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. ఈ ఏడాది మార్చి 10న విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన అనీశా అనే అమ్మాయితో నిశ్చితార్థమైంది. అప్పటి నుంచి వీరికి సంబంధించిన ఫొటోలను అనీశా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుండేది. కానీ ఇటీవల ఈ వీరి ఫొటోలన్నింటినీ ఆమె డిలీట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్. అందుకే వీరి బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చిలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నాక టర్కీకి కూడా వెళ్లొచ్చారు. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం టర్కీలోనే షూటింగ్ జరిగింది. అనీశాను కూడా విశాల్ అక్కడికి తీసుకెళ్లారు. ఇప్పుడు వీరి నిశ్చితార్థం గురించి వస్తున్న వార్తల గురించి అటు విశాల్ గానీ, ఇటు అనీశాగానీ స్పందించలేదు.