logo

header-ad
header-ad

చిదంబరం అరెస్టుపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్‌

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆసక్తికర ట్విట్‌ చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరంను సీబీఐ అధికారులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దిల్లీలోని సీబీఐ నూతన ప్రధాన కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్విటర్‌లో స్పందించారు. ‘‘మాజీ మంత్రి చిదంబరం అరెస్టు వ్యవహారం ప్రజాస్వామ్య ప్రతిరూపానికి నిదర్శనం. ఆయన అరెస్టులో ఓ ప్రత్యేకత ఉంది. గతంలో కేంద్ర హోంమంత్రి హోదాలో సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు అదే కార్యాలయంలో విచారణను ఎదుర్కొంటున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది’’ అని పేర్కొన్నారు.  ఎనిమిదేళ్ల క్రితం చిదంబరం కేంద్ర హోంశాఖా మంత్రి హోదాలో ఈ భవనాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి ప్రారంభించారు.

Source: https://www.eenadu.net/newsdetails/5/2019/08/22/146085/varma-tweet-on-chidambaram-arrest

Leave Your Comment