Happy Birthday Google: వరల్డ్ నంబర్ వన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన 23వ పుట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటోంది. అందకే ఈ రోజు డూడుల్‌లో 23 ప్రత్యేకంగా కనిపింపించేలా డిజైన్ చేసింది. ఐస్‌క్రీమ్స్, కేక్స్, క్యాండిల్స్‌తో ఈ రోజు డూడుల్ కొత్తగా కనిపిస్తోంది. మన దైనందిన జీవితంలో దీని ప్రాముఖ్యత చాలా పెరిగింది. మెమ్-మెటీరియల్‌లో సెర్చ్ ఇంజిన్‌ను ‘గూగుల్ పాపా’ అని పిలుస్తారు. అదే గూగుల్ తన 23 వ పుట్టినరోజును ఇవాళ అంటే.. సెప్టెంబర్ 27 న జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, సెర్చ్ ఇంజిన్ తన హోమ్‌పేజీలో అందమైన డూడుల్‌ను ఏర్పాటు చేసింది.
డూడుల్‌లో కొవ్వొత్తి (గూగుల్‌లో “L” స్థానంలో) దానిపై 23 అని రాసిన డబుల్ టైర్డ్ కేక్ ఉంది. గూగుల్ 4 సెప్టెంబర్ 1998 న ప్రారంభించబడింది. సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్ , లారీ పేజ్ సృష్టించారు, గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే సెర్చ్ ఇంజన్లలో ఇది కూడా ఒకటి.
23 ఏళ్లు పూర్తి..
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు సెర్జే బ్రిన్, లారీపేజ్‌లో ఓ చిన్న స్టార్టప్‌గా 1998లో ప్రారంభించారు. వాస్తవానికి 1998 సెప్టెంబరు 4న గూగుల్ సెర్చ్ ఇంజన్ అందుబాటులోకి వచ్చింది. మొదటి ఏడేళ్ల పాటు సెప్టెంబరు 4నే గూగుల్ వార్షిక వేడుకుల నిర్వహించే వారు.
ఏడేళ్ల తర్వాత..
1998లో గూగుల్ ప్రారంభించినా తొలి ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పేజ్ వ్యూస్ రావడంతో 2005లో గూగుల్ యానివర్సరీ డేట్‌ని సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 27కి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే తేదిని గూగుల్ పుట్టిన రోజుగా జరుపుకుంటోంది.
23కు చాలా స్పెషల్..
గూగుల్ సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నీ జింజర్‌బ్రెడ్, ఐస్‌క్రీం శాండ్‌విచ్, కిట్‌కాట్, లాలిపాప్, మార్ష్‌మాలో, ఓరియో, పై ఇలా ఐస్‌క్రీంల పేర్లతోనే ఉంటాయి. తన థీమ్‌కి తగ్గట్టే ఈ రోజు డూడుల్‌లో కూడా ఐస్‌క్రీంలకు పెద్ద పీట వేస్తూనే కేక్‌ను డూడుల్‌లో పెట్టింది, ఎల్ అక్షరం స్థానంలో క్యాండిల్‌ని ఉంచి వేడుకల ఫ్లేవర్‌ని తెచ్చింది గూగుల్.