యంగ్ హీరో శ్రీవిష్ణు – నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా రాబోతున్న చిత్రం `తిప్పరామీసం`. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ సన్నధం అవుతుంది. ఇక ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది.
కాగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్, శ్రీ ఓం సినిమా పతాకాల పై కృష్ణ విజయ్.ఎల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ చిత్రానికి సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్స్ అయితే చిత్రబృందం బాగా చేస్తోంది. మరి ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తోందో చూడాలి.