logo

header-ad
header-ad

ఏవండోయ్ ఇది విన్నారా? తెలుగు మహిళలకు ఇంటర్‌నెట్ అంటే తెలియదట.. మరి ఏం తెలుసు అనుకుంటున్నారా..

ఇవాళ రేపు ఇంటర్ నెట్ ఉపయోగించని వాళ్లు ఎవరైనా ఉంటారా అంటే ఎవరూ ఉండరని సమాధానం చెబుతారు చాలామంది. కానీ మీకు తెలుసా.. పన్నెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పుట్టి బుద్ధి ఎరిగి ఇప్పటిదాకా ఇంటర్నెట్‌ను ఉపయోగించని మహిళలు నూటికి 60 మందికిపైగానే ఉన్నారట! ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

తెలంగాణలో ఇప్పటి వరకు నెట్‌ ఉపయోగించని మహిళలు 74.1 శాతం అయితే ఏపీలో ఇది ఇంకాస్త ఎక్కువగా 79 శాతంగా ఉంది. తెలంగాణ 26.5, ఏపీలో 21 శాతం, అసోంలో 28.2శాతం, బిహార్‌లో 20.6, గుజరాత్‌లో 30.8 త్రిపురలో 22.9, మేఘాలయలో 34.7, మహారాష్ట్రలో 38, కర్ణాటకలో 35, పశ్చి మ బెంగాల్‌లో 25.5, దాద్రానగర్‌ హవేలీలో 26.5, డామన్‌ అండ్‌ డయ్యూ లో 36.7, అండమాన్‌ అండ్‌ నికోబార్‌లో 34.8 శాతం మహిళలే ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారు. మహిళల అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రా ల జాబితాలోనూ తెలుగు రాష్ట్రాలున్నాయి. తెలంగాణ మహిళల్లో 66.6, ఏపీలోని మహిళల్లో 68.6 శా తం మాత్రమే అక్షరాస్యులు అని తేలింది. పురుషుల్లో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. ఏపీలోని పురుషుల్లో 79.5 మాత్రమే అక్షరాస్యులు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

Source: https://tv9telugu.com/telugu-women-do-not-know-the-internet-366775.html

Leave Your Comment