logo

header-ad
header-ad

అభిమానులకు అండగా సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో తన అభిమానులకు అండగా నిలిచారు. కొవిడ్ కారణంగా ఎంతో మంది ఉపాది కోల్పోవడంతో జీనధారమే భారంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరికి పూటగడవడం కూడా ఎంతో కష్టంగా ఉంది. దీంతో పలువురు సినీ తారలు ప్రజలకు, తమ అభిమానులకు అండగా నిలుస్తున్నారు. తమవంతు సహాయంగా వీలైనన్నీ విధాలుగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ స్టార్ సూర్య తన అభిమానులను ఆదుకున్నాడు. తన అభిమాన సంఘంలో ఉన్న 250 మంది అభిమానుల ఒక్కొక్కరికి రూ. 5000 /- చొప్పున మొత్తం 12.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేశారు. సూర్య  ఫౌండేషన్ అగరం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తుండటమే కాకుండా, సొసైటీకి అవసరమయినప్పుడు తనవంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే పాండిరాజ్, టిజే జ్ఞానవేల్, వెట్రిమారన్‌ల దర్శకత్వంలో నటిస్తున్నారు.

Source: https://www.andhrajyothy.com/telugunews/surya-supports-his-fans-chj-grk-1921061009111161

Leave Your Comment