ఇక గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ ‘నిన్ను వీడని నీడను నేనే’తో మంచి హిట్ అందుకున్నాడు. కానీ సందీప్ కిషన్ కోరుకున్న సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. అందుకే తన తదుపరి సినిమాలను చాల జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కాగా సందీప్ కిషన్ హీరోగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ అనే కొత్త చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం హకీ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కనుంది.
డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో రానున్న ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాల పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.