logo

header-ad
header-ad

5G Internet: అమ్మో ఇంత స్పీడ్ ఇంటర్నెట్టా.. సెకనులో వందల సినిమాలు డౌన్​లోడ్

5G నెట్​వర్క్​ను తొలిసారి కమర్షియలైజ్ చేసిన దక్షిణ కొరియా (South Korea) లో ఇంటర్నెట్ స్పీడ్ విపరీతంగా వేగవంతమైంది. ప్రస్తుతమున్న మూడు నెట్​వర్క్​ల స్పీడ్ అలా ఉందంటే..

ప్రజలకు వేగవంతమైన స్పీడ్​ను ఇచ్చేందుకు 5G నెట్​వర్క్ దూసుకొస్తోంది. వేగవంతంగా సేవలు అందించేందుకు 2021లో సిద్ధం కానుంది. దక్షిణకొరియాలో ఇప్పటికే 5జీ అందుబాటులో ఉంది. అయితే తాజాగా 5జీ వేగం విపరీతంగా పెరిగింది. 2020 రెండో అర్ధభాగంలో ఎస్​కే టెకీకామ్, కేటీ కార్ప్​, ఎల్​ హప్లస్ మొబైల్ నెట్​వర్క్​ల వేగం 690.47 ఎంబీపీఎస్ ఉందట. అదే తొలి ఆరు నెలలు 33.91 ఎంబీపీఎస్​గా నమోదవగా.. ఆ వేగం ఇరవై రెట్లకు పైగా పెరిగింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్​, ఐసీటీ గణాంకాలు వెల్లడించాయి.

795.57 ఎంబీపీఎస్​ సగటు డౌన్​లోడ్ స్పీడ్​తో ఎక్​కే టెలీకామ్​ వేగవంతమైన నెట్​వర్క్​గా ఉండగా.. కేటీ కార్ప్​(667.48 ఎంబీపీఎస్​), ఎల్​జీ యూ ప్లస్ (608.49 ఎంబీపీఎస్​) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కాగా దక్షిణకొరియాలో 4జీ డౌన్​లోడ్ స్పీడ్ 153.1 ఎంబీపీఎస్​గా నమోదైంది.

5జీని కమర్షయలైజ్ చేసిన మొట్టమొదటి దేశం దక్షిణకొరియానే. గతేడాది ఏప్రిల్​లో 5జీ టెక్నాలజీ ఆదేశంలో వేగంగా రూపుదిద్దుకుంది. అక్టోబర్ చివరి నాటికే 10లక్షల మంది యూజర్లు వచ్చారు. అంటే 70 లక్షల మంది మొబైల్ సబ్​స్క్రైబర్లలో 14శాతం మంది అప్పటికే 5జీకి మారారు.

మొదట్లో క్వాలిటీ సమస్యలు, లిమిటెడ్ కవరేట్​, అంచనా వేసిన దాని కంటే తక్కువ వేగంతో తొలి అర్ధభాగంలా 5జీపై అసంతృప్తి వ్యక్తమైంది. అయితే ఆ తర్వాత మెరుగవడంతో యూజర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022 కల్లా దేశవ్యాప్తంగా 5జీ అందించాలని దక్షిణకొరియా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రముఖ టెలీకాం సంస్థలు 5జీ నెట్​వర్క్ కోసం 25.7ట్రిలియన్​ (24 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

భారత్​లో ఈ ఏడాది రెండో అర్ధభాగంలో 5జీ నెట్​వర్క్​ను తెచ్చేందుకు జియో సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద నెట్​వర్క్​గా ఉన్న జియో.. తాము 5జీకి సిద్ధమని ప్రకటించింది. అలాగే ఆ సంస్థ నుంచి చౌకగానే 5జీ ఫోన్లు సైతం వచ్చే అవకాశముంది.

Source: https://telugu.news18.com/news/technology/south-korea-5g-network-average-speed-reaches-691mbps-can-download-hundreds-of-movies-per-second-krs-711078.html

Leave Your Comment