logo

header-ad
header-ad

ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

పొగతాగడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ధూమపానంతో మానసిక సమస్యలు కూడా వస్తాయని, ముఖ్యంగా పొగతాగేవారు డిప్రెషన్ బారిన పడతారని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన పరిశోధకులు యూకేకు చెందిన 4,62,690 మందికి సంబంధించిన బయోబ్యాంక్ డేటాను విశ్లేషించి ఫలితాలను వెల్లడించారు. ఈ క్రమంలో వారు చెబుతున్న ప్రకారం.. స్మోకింగ్ వల్ల డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. కనుక పొగతాగేవారు ఆ అలవాటుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Source: https://www.ntnews.com/health/smoking-causes-depression-says-study-1-1-10609238.html

Leave Your Comment