logo

header-ad
header-ad

‘డాక్టర్ వరుణ్’గా శివ కార్తికేయన్

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాక్టర్’. కే.జె. ఆర్ స్టూడియోస్ కోటపాడి జే రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌కె ప్రొడక్షన్స్‌తో కలిసి విజయదశమి సందర్బంగా అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకులకు ‘డాక్టర్ వరుణ్’ పేరుతో అందించనున్నారు. ఇదివరకే విడుదలైన తమిళ పాటలు, అనిరుధ్ సంగీతం చిత్రంపై మంచి అంచనాలు పెంచగా, తెలుగులో కూడా పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా, వినయ్ రాయ్ విలన్‌గా నటించారు.

ఈ సందర్బంగా నిర్మాత  కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ.. “మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘బీస్ట్’ అనే చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. శివకార్తికేయన్‌తో ఇదివరకు మేము తీసిన ‘శక్తి’ అనే చిత్రం మంచి హిట్ అయ్యి మాకు లాభాల పంట పండించింది. ఈ చిత్రం కూడా అలాగే సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలని మించి ఈ చిత్రం ఉంటుందని మేము కచ్చితంగా చెప్పగలం’’ అని తెలుపగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘శివకార్తికేయన్ - అనిరుధ్ కాంబినేషన్‌లో అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. డాక్టర్ వరుణ్‌గా శివ కార్తికేయన్ నవరసాలు చూపించారు. ఎన్నో ఒడిదుడుకుల తరువాత చిత్రం థియేటర్స్‌లో అక్టోబర్ 9న విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులని నూటికి నూరు శాతం అలరిస్తుంది..’’ అని తెలిపారు. 

 

Source: https://chitrajyothy.com/telugunews/sivakarthikeyan-turns-doctor-varun-for-telugu-audience-kbk-mrgs-chitrajyothy-1921092206515853

Leave Your Comment