logo

header-ad
header-ad

SBI Special FD Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరేందుకు గడువు పెంపు.. వడ్డీ రేటు 6.2 శాతం

SBI Special FD Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ మధ్య కాలంలో వినియోగదారుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వివిధ డిపాజిట్లపై మేలైన వడ్డీ రేట్లను అందిస్తోంది. అలాగే సీనియర్‌ సిటిజన్స్‌ కోసం కూడా ప్రత్యేక స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది ఎస్‌బీఐ. తాజాగా సీనియర్‌ సిటిజన్స్‌ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. సీనియర్‌ సిటిజన్స్‌కు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ‘ఎస్‌బీఐ వీకేర్’ సెప్టెంబర్‌ 30 వరకు అందుబాటులో ఉంటుంది. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ప్రత్యేకంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఐదేళ్లపదవీ కాలం, అంతకంటే ఎక్కువ కాలం వారికి పెట్టుబడులపై అధిక వడ్డీ రేటు పొందడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఎస్‌బీఐ వెకేర్‌ డిపాజిట్‌గా పిలువబడే ఈ కొత్త పథకానికి వారి స్థిర డిపాజిట్లపై అదనంగా 30 బేసిక్‌ పాయింట్లను పొందుతున్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐ టర్మ్‌ డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 50 బేసిక్‌ పాయింట్లను అందిస్తుంది. ఒకవేళ ‘ఎస్‌బీఐ వీకేర్’ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే అదనంగా 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ లభిస్తుంది. అంటే ‘ఎస్‌బీఐ వీకేర్’ స్కీమ్‌లో డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్లు 6.2 శాతం వడ్డీ పొందొచ్చు.

. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. అది కూడా 2021 సెప్టెంబర్‌ 30 లోగా ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేట్లను తరచూ మారుస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను చెక్ చేయాలి. ‘ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్’ స్కీమ్‌‌లో డిపాజిట్ చేయాలంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయవచ్చు.మొదట ఐదేళ్లకు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. అయితే ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే వడ్డీ నష్టపోవాల్సి ఉంటుంది.

Source: https://tv9telugu.com/business/sbi-special-fd-scheme-offers-6-2-interest-rates-for-senior-citizens-know-more-504051.html

Leave Your Comment