logo

header-ad
header-ad

రెండేళ్ళ నా కొడుకును క్యాన్సర్ నుంచి కాపాడండి

"అరుదైన లివర్ ట్యుమర్‍తో బాధపడుతున్న 2 ఏళ్ల వయసున్న నా కొడుకును చూస్తుంటే నిస్సహాయతతో దుర్భరంగా అనిపిస్తోంది. వాడి వేదన, రోదన మా గుండెల్ని చీల్చేస్తున్నాయి. వాడు వేగంగా కోలుకోవాలని ప్రతి రోజూ నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. చిలిపి పనులతో అలరించే నా అల్లరిబాబును మళ్ళీ అలాగే చూడాలి. ఇంకా వేచి చూడలేను." శశాంక్ తల్లి అపర్ణ ఆవేదన ఇది.

నవజాత శిశువుగా శశాంక్ పుట్టినప్పుడే తక్కువ బరువుతో చాలా బలహీనంగా పుట్టాడు. చాలా ఆస్పత్రులు తిరిగి, ఎంతో చికిత్స చేయించాక చాలా కాలం తర్వాత కోలుకున్నాడు. మా అబ్బాయి మెల్లగా కోలుకుంటూ, చురుకుగా ఆడుకుంటూ అంతా బాగున్నట్టే అనిపించింది.

కానీ, పరిస్థితులు వెంట వెంటనే తల్లకిందులయ్యాయి.

అక్టోబర్ 2019లో శశాంక్ కడుపు మీద వాపు మొదలైంది. తర్వాత ఆస్పత్రికి వెళ్లినప్పుడు డాక్టర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చినప్పుడు వాళ్ళు వెంటనే పరీక్షలు చేశారు. ఆ తర్వాత డాక్టర్లు మమ్మల్ని పిలవడానికి ముందు వారిలో వారు మెల్లగా మాట్లాడుకోవడం మేం బయటి నుంచి చూశాం.

"మీకొక దుర్వార్త చెప్పాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. మీ బాబు Hepatoblastoma అనే ఒక రకమైన లివర్ క్యాన్సర్‌కు గురైనట్టు అనిపిస్తోంది. అదింకా ప్రాథమిక దశల్లోనే ఉంది. ఈ గండం గడవాలంటే బాబుకు వెంటనే చికిత్స ప్రారంభించాలి" అని ఆ డాక్టర్లు మాతో అన్నారు.

కేవలం రెండేళ్ళ వయసున్న నా కొడుకు ప్రాణాంతకమైన వ్యాధికి గురయ్యాడంటే... నాకు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనైంది.

ఆ విధి మా పట్ల ఎందుకింత అన్యాయంగా ఉండాలి? నా కొడుక్కి ఇంకా బతుకంటే అర్థమే తెలీదు. ఇంతటి భారమైన జబ్బును వాడిపై మోపడం దారుణం కాదా?

ఈ లింక్ పై క్లిక్ చేసి శశాంక్ చికిత్స కోసం పెద్ద మనసుతో సాయం చెయ్యండి

శశాంక్‌కి ఇప్పుడు Left Hepatectomy సర్జరీ మాత్రమే ఆశాకిరణమని డాక్టర్లు చెప్పారు. ఇందుకు చికిత్స చెయ్యాలంటే రూ.5 లక్షల (6737.68 డాలర్లు) భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా వేశారు.

నా భర్త శంకర్ మాత్రమే నా కుటుంబానికి ఆధారం. ఆయన కేవలం నెలకు రూ.8,000 మాత్రమే సంపాదించే ఒక వ్యవసాయ కూలీ. కనీసం రెండు పూటలైనా మా కడుపులు నిండని వారాలెన్నో... ఈ పరిస్థితుల్లో మేము పదే పదే శశాంక్ చికిత్స కోసం ఆస్పత్రి బిల్లులు చెల్లించాల్సిన దుస్థితి.

మాకున్న విలువైన వస్తువులన్నీ అమ్మేశాం. పదే పదే అప్పులు చేశాం. స్నేహితుల నుంచి చేబదుళ్ళు తీసుకున్నాం. మా డబ్బంతా శశాంక్ ఆస్పత్రి బిల్లులకు ఆహుతైపోయింది. మా ఆశలన్నీ అడుగంటిపోయాయి.

"నా కొడుకును ఈ పరిస్థితుల్లో చూడటం నన్ను కృంగదీస్తోంది. ఆడుతూ.. పాడుతూ నవ్వులు పూయించే నా ముద్దుల బాబు ఇప్పుడు బాధతో విలవిలలాడుతుండటం చూడలేకపోతున్నాను. ఇప్పటికీ బలహీనంగా ఉన్నాడు. ఏది మంచో.. ఏది చెడో కూడా తెలియని పసి వయసు. ఇది మా చిన్నారికి ఎదురు కావలసిన పరిస్థితి కాదు. సంపాదించిందంతా ఖర్చు పెట్టేశాం. ఇప్పుడు ఆసరా లభించని పరిస్థితుల్లో ఉన్నాం."

దాతలకు విజ్ఞప్తి....

మా బాబును కాపాడుకోవడానికి మేం చెయ్యగలిగిందంతా చేశాం. కానీ, ఇప్పుడు మీ సాయమే మాకు అండ. ఈ చికిత్స జరిగితేనే మా అబ్బాయికి కొత్త జీవితం లభిస్తుందని డాక్టర్లు కచ్చితంగా చెప్పేశారు.

మీ సహాయం కోసం ఎంతో ఇదిగా ఎదురుచూస్తున్నాం. మా కుటుంబంలో నవ్వులు పూయించేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి. జీవితాన్ని అనుభవించేందుకు మా శశాంక్‌కి మరో అవకాశం ఇవ్వండి.

ఎంత చిన్న సహాయమైనా విలువైనదే.... మా బాబును కాపాడుకునేందుకు సహకరించండి. పెద్ద మనస్సుతో విరాళం ఇవ్వండి.

Source: https://andhrajyothy.com/telugunews/save-my-two-year-old-son-from-cancer-1921071603134038

Leave Your Comment