logo

header-ad
header-ad

కేరళకు మహేష్ అండ్ టీమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు అనిల్ రావిపూడి పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ ఎక్కడా అనవసరమైన బ్రేక్స్ రాకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం టీమ్ కొత్త షెడ్యూల్ కోసం కేరళకు బయలుదేరి వెళ్లింది.

ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని, ఇందులో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. చిత్ర టీమ్ సమాచారం మేరకు ఇప్పటివరకు వచ్చిన ఔట్ పుట్ చాలా బాగుందని తెలుస్తోంది. ‘మహర్షి’ లాంటి భారీ హిట్ తర్వాత మహేష్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే యేడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.

ఇకపోతే ఇందులో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. అలాగే విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 

Source: https://www.123telugu.com/telugu/news/sarileru-neekevvaru-team-went-to-kerala.html

Leave Your Comment