logo

header-ad
header-ad

మోటరోలాకు షాక్‌: శాంసంగ్‌ మరో మడత ఫోన్‌

మొబైల్‌ ఫోన్‌దిగ్గజం శాంసంగ్‌లో మరో నూతన మడతబెట్టే ఫోన్‌ను ఆవిష్కరించనుంది.   గెలాక్సీపోల్డ్‌ పేరుతో మడతబెట్టే ఫోనును మార్కెట్లోకి తీసుకువచ్చిన  శాంసంగ్‌   రెండవ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. హువావే, మోటరోలా కూడా త్వరలో మడతబెట్టే ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సరికొత్త మోడల్‌ను విడదుల చేయనున్నామని శాంసంగ్‌ డెవలపర్స్‌ సదస్సులో కంపెనీ  ప్రకటించింది.  నూతన మోడల్‌ పొడవాటి డిసిప్లే నిలువుగా మడతబెట్డే విధంగా తయారు చేస్తున్నట్లు  కంపెనీ తెలిపింది. ప్రధానంగా మోటరోలా ఈ నెల(నవంబరు) 13న లాంచ్‌ చేయనున్న  ఫోల్డబుల్‌ ఫోన్‌  'మోటరోలా రాజర్'  తరహాలీ దీన్ని  రూపొందించింది.   అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు  సంబంధించిన పూర్తి వివరాలు విడుదలచేయలేదు. దీనిని మడతబెట్టినప్పుడు చేతిలో ఒదిగిపోయేలా.. తెరిచినప్పుడు పొడవాటి డిసిప్లేతో ఆకర్షించేలా వుండనుందని అంచనా. మోడల్‌నెంబర్‌ ఎస్‌ఎం-ఎఫ్‌700ఎఫ్‌గా పిలిచే ఈ ఫోన్‌ 256 జీబీ అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తుంది.

Source: https://www.sakshi.com/news/business/samsung-unveils-new-flip-phone-style-foldable-phone-concept-1236918

Leave Your Comment