logo

header-ad
header-ad

హైబ్రిడ్ పిల్ల ఆడవాళ్ళ కోసం గళమెత్తిందిగా…!

స్త్రీ సాధికారత, అభివృద్ధి, రక్షణ వంటి విషయాలకు చర్చా వేదికగా ‘వి ది విమెన్’ పేరుతో బెంగుళూరు వేదికగా నేడు ఓ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలలో రాణించిన మహిళలు, ఫెమినిస్ట్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని స్త్రీ అభివృద్ధి, స్వాతంత్య్రం, రక్షణ వంటి విషయాలపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిధా బ్యూటీ సాయి పల్లవి పాల్గొన్నారు. స్త్రీ గురించి తనదైన భావాలు అర్థవంతంగా వివరించి సభలో అందరి మనసులను గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో సాయి పల్లవి ప్రత్యేకంగా నిలిచింది.

కాగా సాయి పల్లవి తెలుగులో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది. ఒకటి రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం, మరొకటి నాగ చైతన్య సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న’లవ్ స్టోరీ’ అనే మూవీ. ఈ రెండు చిత్రాలలో సాయి పల్లవి కీలక పాత్రలు చేస్తుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా చిత్రంతో సాయి పల్లవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. లవ్ స్టోరీ మూవీ వీరి కాంబినేషన్లో వస్తున్న రెండవది కావడంతో అంచనాలు బాగున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజున విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు.

Source: https://www.123telugu.com/telugu/news/saipallavi-participated-in-we-the-women-program.html

Leave Your Comment