తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 30వ రోజుకు చేరుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో పాల్గొంటున్నారు కార్మికులు.. ఇక, సంగారెడ్డి జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును అడ్డుకున్నారు ఆర్టీసీ కార్మికులు. అమీన్పూర్ పరిధిలోని రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ర్యాలీలో బైక్‌పై బీరంగూడ కమాన్ దాటుతుండగా హరీష్‌రావుని అడ్డుకున్నారు కార్మికులు. ఆయన ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. మరోవైపు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టడంతో రాష్ట్రంలోని కొన్ని ఆర్టీసీ డిపోల్లో కొందరు ఆర్టీసీ కార్మికులు వచ్చి విధుల్లో చేరుతున్నారు. ఆర్టీసీ జేఏసీ మాత్రం సమ్మె యథావిథిగా కొనసాగుతోందని ప్రకటించింది.

Source: https://www.ntvtelugu.com/post/rtc-workers-who-blocked-minister-harish-rao-in-sangareddy-district