logo

header-ad
header-ad

కేసీఆర్ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. ఒక్కొక్కరుగా విధుల్లోకి ఆర్టీసీ కార్మికులు..!

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు డెడ్‌లైన్ పెట్టారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఈ నెల 5వ తేదీన రాత్రి 12 గంటల వరకు విధుల్లో చేరాలని.. లేని పక్షంలో ఇప్పటికే 5 వేల రూట్లలో ప్రైవేట్ పర్మిట్లను ఆమోదం తెలిపాం.. మిగతావి కూడా ప్రైవేట్ పరం చేయనున్నట్టు తెలిపారు. అయితే, సీఎం కేసీఆర్ పిలుపుకు ఆర్టీసీ కార్మికులు స్పందిస్తున్నారు. పరిమిత సంఖ్యలో ఉద్యోగులు కొన్నిడిపోల్లో విధుల్లో చేరుతున్నారు. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని కేసీఆర్‌ డెడ్‌లైన్ విధించడంతో ఇప్పటిదాకా సమ్మెలో పాల్గొన్న కొందరు కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోలకు వస్తున్నారు. సిరిసిల్లలో డిపో మెకానిక్ శ్రీనివాస్ విధుల్లో చేరారు. సిద్దిపేటలో కండక్టర్ విశ్వేశ్వరరావు, కామారెడ్డిలో డ్రైవర్ సయ్యద్ హైమత్, భద్రాచలంలో డిపో డ్రైవర్ శేషాద్రి, మిర్యాలగూడలో కండక్టర్ ఎస్‌కేఎమ్ వలీ విధుల్లో చేరారు. మరికొందరు డిపోలకు క్యూకడుతున్నారు. డ్యూటీలో చేరే కార్మికులకు భద్రత కల్పిస్తామని పోలీసులు తెలిపారు. సీఎం డెడ్‌లైన్ విధించడంతో.. ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్రుగా విధుల్లో చేరుతున్నారు.. మరి ఈ సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో వేచిచూడాలి.

Source: https://www.ntvtelugu.com/post/rtc-workers-rejoins-in-duty-after-cm-kcr-statement

Leave Your Comment