logo

header-ad
header-ad

కేసీఆర్ డెడ్ లైన్ కి తలొగ్గని ఆర్టీసీ

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ ముగిసిపోయింది. దీంతో ఇప్పుడేం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. కోర్టే తమకు న్యాయం చేస్తుందన్న ధీమా కార్మికులకు ఉన్నట్టు కనిపిస్తోంది. స్వయంగా సీఎం చెప్పినా.. కార్మికులు పదుల సంఖ్యలోనే విధుల్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఎల్లుండి హైకోర్టులో జరిగే విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఇప్పటికే కేసీఆర్ రెండు విడతలుగా డెడ్ లైన్ విధించారు. ఒకసారి సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులు, ఉద్యోగులు మంగళవారం అర్థరాత్రి లోపుగా సమ్మె నుంచి బయటకు వచ్చి స్వచ్ఛందంగా విధుల్లో చేరితే వాళ్ల ఉద్యోగాలు ఉంటాయని, అలాగే యాభై శాతం ఆర్టీసీ ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ కేసీఆర్ డెడ్ లైన్ కు కార్మికులు పెద్దగా స్పందించడం లేదు. కేవలం 373 కార్మికులు మాత్రమే విధుల్లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. కార్మికులు మాత్రం న్యాయస్థానం మీదే ఆశలు పెట్టుకున్నారు. 

Source: https://www.ntvtelugu.com/post/rtc-employees-not-surrendering-to-kcr

Leave Your Comment