logo

header-ad
header-ad

జియో మరో సంచలనం... ఇక, వారికి షాకే..!

టెలికాం రంగం సునామి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ జియో మరో సంచలనానికి నాంది పలికింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్‌డౌన్‌ పరిస్థితులను సరిగ్గా క్యాష్ చేసుకునేందుకు కొత్త వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ని లాంచ్ చేసింది. రిలయన్స్ జియో తన ప్లాట్ ఫాం మీద జియో మీట్‌ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అత్యవసరంగా మారిన వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలలోకి ప్రవేశించింది.  అంతేకాదు రంగంలో దూసుకుపోతున్న జూమ్, గూగుల్ మీట్, హౌస్‌పార్టీ లాంటి యాప్ లకు గట్టి  షాక్ ఇచ్చింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్‌ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి జియోమీట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త తరహా ఆలోచనలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించే రిలయన్స్.. ఇప్పుడు ఈ తరహాలో ప్రజలను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. మరి, టెలికాం రంగంలో సత్తా చాటినట్టే ఇక్కడ కూడా.. తన స్టామినా చాటుతుందేమో చూడాలి. టెలికాం రంగంలో అడుగుపెట్టి.. మిగతా సంస్థలకు షాక్ ఇచ్చినట్టే.. ఈ ప్లాట్‌ ఫాంలో కూడా జియో పనిచేస్తుందనే అంచనాలు లేకపోలేదు. 

 

Source: https://www.ntvtelugu.com/post/reliance-launches-a-new-video-calling-application-jio-meet

Leave Your Comment