logo

header-ad
header-ad

కాసేపట్లో రెడ్‌మీ 9 సేల్...

షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన రెడ్‌మీ 9 సేల్ ఇవాళ అమెజాన్‌లో జరగనుంది. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే. రెడ్‌మీ 9 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలుసుకోండి.

1. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన షావోమీ... ఇటీవల రూ.9,999 ధరకు రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెడ్‌మీ 9 సిరీస్‌లో వచ్చిన 5వ స్మార్ట్‌ఫోన్ ఇది.

2. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్‌మీ 9 ప్రైమ్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు రెడ్‌మీ 9 మోడల్‌ను పరిచయం చేసింది.

3. రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి.

4. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్ ఓవర్ వైఫై-VoWiFi ఫీచర్ ఉండటం మరో విశేషం. రెడ్‌మీ 9 ప్రారంభ ధర రూ.8,999. కాసేపట్లో సేల్ ప్రారంభం కానుంది.

5. అమెజాన్‌తో పాటు షావోమీ ఇండియా వెబ్‌సైట్‌లో కొనొచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా రెడ్‌మీ 9 లభిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన రియల్‌మీ సీ12, రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది రెడ్‌మీ

6. రెడ్‌మీ 9 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది.

7. రెడ్‌మీ 9 రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. 

8. రెడ్‌మీ 9 బ్యాటరీ 5,000ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 

9. రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్+ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంటుంది. 

10. రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌ను స్పోర్టీ ఆరెంజ్, స్కై బ్లూ, కార్బన్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

11. రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,999.

Source: https://telugu.news18.com/photogallery/technology/redmi-9-sale-today-on-amazon-and-xiaomi-india-website-know-price-and-specs-ss-591926-page-13.html

Leave Your Comment