logo

header-ad
header-ad

రియల్‌మీ నార్జో 20 ప్రో .. కాసేపట్లో సేల్

Realme Narzo 20 Pro Sale | రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భారీగా ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

1. రియల్‌మీ ఇటీవల రియల్‌మీ నార్జో 20, రియల్‌మీ నార్జో 20ఏ స్మార్ట్‌ఫోన్లతో పాటు రియల్‌మీ నార్జో 20 ప్రో మోడల్‌ని పరిచయం చేసింది. ఈ మూడింటిలో హైఎండ్ స్పెసిఫికేషన్స్ రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఉండటం విశేషం.

2. రియల్‌మీ నార్జో 20 ప్రో సేల్ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో మొదలు కానుంది. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.

3. రియల్‌మీ నార్జో 20 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 90Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే ఉంది. 6జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్‌లో రిలీజైంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 

4. రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. 

5. రియల్‌మీ నార్జో 20 ప్రో బ్యాటరీ 4500ఎంఏహెచ్ బ్యాటరీ. 65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 38 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. 

6. రియల్‌మీ నార్జో 20 ప్రో ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ. 

7. రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్+ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. 

8. రియల్‌మీ నార్జో 20 ప్రో వైట్ నైట్, బ్లాక్ నిన్జా కలర్స్‌లో లభిస్తుంది.

9. రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999.

10. రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. పార్ట్‌నర్ ఆఫర్‌లో భాగంగా ఈ మొబైల్ కొన్నవారికి బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఎంపిక చేసిన ఫ్యాషన్ వేర్‌పై అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

Source: https://telugu.news18.com/photogallery/technology/realme-narzo-20-pro-sale-today-on-flipkart-get-10-per-cent-discount-with-axis-bank-buzz-credit-card-ss-613788-page-10.html

Leave Your Comment