logo

header-ad
header-ad

సెప్టెంబర్ 20న రానున్న రియల్‌మీ సీ17..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన సీ17 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్ లైన్లో లీకయ్యాయి. మిడ్ లెవల్ ప్రీమియం స్థాయిలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

 Realme C17

రియల్ మీ సీ17 సెప్టెంబర్ 20వ తేదీన లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ మొదట బంగ్లాదేశ్‌లో లాంచ్ అవుతుందని, తర్వాత మిగతా దేశాల్లో లాంచ్ అవుతుందని, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. దీనికి సంబంధించిన వర్చువల్ లాంచ్ సెప్టెంబర్ 20వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు జరగనుంది. కంపెనీ ఫేస్ బుక్, యూట్యూబ్ అకౌంట్లలో ఈ స్ట్రీమింగ్ జరగనుంది.

రియల్ మీ సీ17 లాంచ్

కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఫోన్ మిడ్ లెవల్ ప్రీమియం స్థాయిలో రానుంది. ఈ ఫోన్ అల్ట్రా స్మూత్ డిస్ ప్లేతో రానుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్‌తో ఈ ఫోన్లు రానున్నాయి. ఈ ఫోన్ ఈ మధ్యే గీక్ బెంచ్ వెబ్ సైట్లో కనిపించింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రానుంది.

రియల్ మీ సీ17 స్పెసిఫికేషన్లు

ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను టిప్ స్టర్ ముకుల్ శర్మ లీక్ చేశారు. ముకుల్ తెలిపిన దాని ప్రకారం ఇందులో 6.5 అంగుళాల హోల్ పంచ్ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ టు బాడీ రేషియో 90 శాతంగా ఉండనుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా కూడా ఇందులో ఉండనున్నాయి. లేక్ గ్రీన్, నేవీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. బ్యాటరీ, చార్జింగ్ స్పీడ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ సిరీస్‌లో ఈ మధ్యే రియల్ మీ సీ12, సీ15 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి.

Source: https://telugu.samayam.com/tech/news/realme-c17-launch-on-september-20th-specifications-tipped/articleshow/78126894.cms

Leave Your Comment