భారత్‌లో వడ్డీరేట్లు మరింత దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ అంచనా వేస్తోంది. 2020 మార్చి ముగిసే నాటికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రెపో రేటును మరో 0.40 శాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇప్పటివరకూ ఆర్‌బీఐ తీసుకున్న పరపతి విధాన సరళీకరణ చర్యలు ఆర్థికవృద్ధికి తగిన విధంగా దోహదపడలేదని విశ్లేషించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. గడచిన వరుస నాలుగు ద్వైమాసిక సమీక్షల కాలంలో ఈ రేటును ఆర్‌బీఐ 1.1% తగ్గించింది. దీనితో రెపో రేటు 5.40 శాతానికి దిగివచ్చింది. అయితే రెపో తగ్గింపు ప్రయోజనం పూర్తిగా కస్టమర్లకు బదలీకాలేదు.

Source: https://www.sakshi.com/news/business/rbi-may-cut-interest-rates-40-basis-points-fiscal-end-fitch-1216399