రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కేంద్రానికి భారీ బొనాంజా ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.76 లక్షల కోట్లను కేంద్రానికి అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌బీఐ బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను బోర్డు ఆమోదించింది. రికార్డు స్థాయిలో ఈ మొత్తాన్ని ప్రకటించడం చర్చనీయాంశమైంది.
2018-19 సంవత్సరానికి ఎకనామిక్ కాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఇసిఎఫ్)గుర్తించిన 1,23,414 కోట్ల రూపాయల డివిడెండ్‌కు అదనంగా రూ.52,637కోట్ల మిగులు నిల్వను జోడించి మొత్తం రూ.1,76,051 కోట్లను భారత ప్రభుత్వానికి బదిలీ చేయాలని సెంట్రల్ బ్యాంక్ బోర్డు నిర్ణయించిందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఊహించని పరిణామమని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.

Source: https://www.sakshi.com/news/business/rbi-approves-surplus-transfer-rs-176-trillion-government-1218989