logo

header-ad
header-ad

పబ్జీకి బానిసై ప్రాణం తీసుకున్న బాలుడు.!

పబ్జీ మొబైల్ గేమ్ కు బానిసై ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ గేమ్ ఆడుతూ తల్లి తండ్రులు మందలించడంతో సూసైడ్ కి పాల్పడుతున్నారు. ఈ గేమ్ పై నిషేధం విధించాలంటూ కూడా చాలా మంది తల్లి తండ్రులు కోర్టుల్లో ఫిర్యాదు చేశారు. ఇక తాజాగా పబ్జికి బానిసై 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రం కోటాలో జరిగింది. రైల్వే కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ హన్స్‌రాజ్‌ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీకి చెందిన ఓ వ్యక్తి కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం తల్లి ఫోన్ లో గేమ్ డౌన్ లోడ్ చేసుకున్న బాలుడు అప్పటి నుండి నిరంతరంగా పబ్జి ఆడటం మొదలు పెట్టాడు. కాగా అతడు గత రాత్రి 3గంటల సమయంలో వెంటిలేటర్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

 

Source: https://www.ntvtelugu.com/post/rajasthan-teen-hangs-self-was-playing-mobile-game

Leave Your Comment