logo

header-ad
header-ad

ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి పెళ్లి…?

బిగ్ బాస్ షో అంటేనే సంచలనాలకు కేంద్ర బిందువు. రోజుల తరబడి ఒకే ఇంటిలో ఉండే కంటెస్టెంట్స్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటం సర్వసాధారణం. అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, స్నేహం కావచ్చు లేదా గౌరవం కావచ్చు. ఇలాంటి పాజిటివ్ రిలేషన్స్ మాత్రమే కాకుండా శత్రుత్వం, ద్వేషం, కోపం వంటివి కూడా కొందరి మధ్య ఏర్పడతాయి. అసలు… కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టడం, వారి ఎమోషన్స్ కి పరీక్ష పెట్టడమే బిగ్ బాస్ షో సారాంశం. కాగా ఈ సీజన్ కి బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరి సభ్యుల మధ్య రిలేషన్ ప్రేక్షకులకు ఆసక్తి రేపింది.

రాహుల్ మరియు పునర్నవి ల మధ్య అనుబంధం అందరికీ ముచ్చటేసింది. వీరి స్నేహం ఒక దశలో ప్రేమగా మారినట్లు అందరికీ అనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పునర్నవికి ప్రపోజ్ కూడా చేశారు. అలాగే పునర్నవి ఎలిమినేటై హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయినప్పుడు రాహుల్ చాలా ఎమోషన్ ఐయ్యారు. కాగా తాజాగా మీడియా వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరి పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాల పెద్దలు సిద్ధంగా ఉన్నారట. ఈ జంట కనుక ఒకే చెవితే వారికి పెళ్లి నిరభ్యంతరంగా చేస్తామని వారు ప్రకటించినట్లు సమాచారం. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రాహుల్ కొరకు పునర్నవి బయట క్యాంపైన్ చేశారు. మరి చూడాలి వీరి బంధం పెళ్లి పీటలెక్కుతుందో లేదో.

Source: https://www.123telugu.com/telugu/news/is-rahul-going-to-knot-punarnvi.html

Leave Your Comment