logo

header-ad
header-ad

మీ జీమెయిల్ అకౌంట్‌ డీయాక్టివేట్‌ కాకుండా కాపాడుకోండి!

జీ మెయిల్‌ వినియోగదారుల కోసం గూగుల్ సంస్థ కొత్త విధానాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. 2021 జూన్ నుంచి కొత్త విధానాలను అమలులోకి తీసుకురావడానికి కృష్టిచేస్తున్నారు. ఈ కొత్త విధానాలను అనుసరించకపోతే.. మీ జీ మెయిల్ అకౌంట్‌ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. తస్మాత్‌ జాగ్రత్త! లేనిపక్షంలో మీరు ఎంతో భద్రంగా దాచుకున్న ఫొటోలు, డాక్యుమెంట్లతో పాటు ఎన్నో విలువైన మెయిళ్లను నష్టపోవడం ఖాయం.

ఏడాది కాలం నుంచి జీ మెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్‌ సక్రమంగా వాడనివారి అకౌంట్‌ నుంచి కంటెంట్‌ను సంస్థ తొలగించే అవకాశం ఉన్నది. యాక్టివ్‌గా లేని ఖాతాను డియాక్టివేట్ చేయనున్నారు. ఈ మేరకు సంస్థ బుధవారం ఒక ప్రకటన చేసింది. అకౌంట్స్‌ను యాక్టీవ్‌గా వినియోగించని వారికోసమే ఈ కొత్త విధానాలు తీసుకువస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. గూగుల్ సర్వీసులు అయిన గూగుల్ డ్రైవ్, డాక్స్, స్లైడ్, డ్రాయింగ్, ఫార్మ్స్, జామ్ బోర్డు వంటి ఫైల్స్‌ను కూడా తొలగించే అవకాశాలున్నాయి. స్టోరేజ్ కెపాసిటీ కోసం గూగుల్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. వినియోగదారు ఖాతాలో గత రెండేండ్ల నుంచి స్టోరేజ్ లిమిట్ దాటి ఉంటే.. అప్పుడు గూగుల్ జీ మెయిల్, డ్రైవ్, ఫొటోల నుంచి తొలగించే అవకాశం ఉంది. అయితే కంటెంట్‌ను తొలగించే ముందు వినియోగదారులు కంటెంట్ కోల్పోకుండా వారికి తరచూ మెయిల్స్ పంపుతారు.  అయితే, మీ జీ మెయిల్, డాక్స్, డ్రైవ్స్, ఫొటోస్‌లను తరచూ చెక్ చేస్తూ ఉండండి. దాంతో పాటు ఇనాక్టివ్ ఎకౌంట్ మేనేజర్‌లో కూడా స్పెసిఫిక్ కంటెంట్ మేనేజ్ చేయవచ్చు. ఒకవేళ 15 జీబీల కన్నా ఎక్కువ స్టోరేజీ అవసరం అనిపిస్తే గూగుల్ వన్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

Source: https://www.ntnews.com/business/follow-these-to-protect-your-gmail-account-from-being-deactivated-100046

Leave Your Comment