logo

header-ad
header-ad

ఢిల్లీ ప్రజల కోసం ప్రియాంక ఏం చేసిందంటే..

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొల్యూషన్ ఎలా మారిపోయిందో తెలియందే.  పొల్యూషన్ కారణంగా రాజధానిలో పొగమంచు ఏర్పడింది.  పట్టపగలే చీకట్లను తలపించే విధంగా మారిపోతున్నది.  దీంతో ఢిల్లీ ప్రభుత్వం సరి బేసి సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చింది.  అయితే, ఢిల్లీ పొల్యూషన్ గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది.  

ఢిల్లీలో కాలుష్యం కారణంగా షూటింగ్ లో పాల్గొనడం కష్టంగా ఉందని, ఈ కాలుష్యంతో ప్రజలు ఎలా కాలం వెళ్లదీస్తున్నారో అర్ధం కావడం లేదని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.  ఇక ఇల్లు, మాస్క్ లు లేని వ్యక్తులు ఎలా జీవిస్తున్నారో తెలియడం లేదని ఆమె చెప్పింది.  స్కై ఈజ్ పింక్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ప్రస్తుతం ప్రియాంక ది వైట్ టైగర్ సినిమా చేస్తున్నది.

Source: https://www.ntvtelugu.com/post/priyanka-chopra-tweet-about-delhi-pollution

Leave Your Comment