Adipurush: బాహుబలి అనే ఒక్క సినిమా భారతీయ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. భాషలు, ప్రాంతాల మధ్య ఉన్నగీతలను చెరిపేసిందీ సినిమా. ఈ సినిమాతో ప్రభాస్‌కు ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా గుర్తింపు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగారు. విదేశాల్లో కూడా బాహుబలి సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ నుంచి వచ్చే ప్రతీ సినిమాపై ఇండియన్ సినిమా దృష్టిపడుతోంది. ఈ క్రమంలో తెరకెక్కుతోన్న చిత్రమే ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అటు బాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఇక ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డ నిర్మాతలు రెబల్ స్టార్ చిత్రాలను భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆదిపురుష్ ఇప్పుడు ఆ స్థాయిని కూడా దాటేసి పాన్ వరల్డ్ సినిమాగా పేరు దక్కించుకునేలా కనిపిస్తోంది. దీనికి కారణం ఈ సినిమా విడుదల కానున్న స్క్రీన్‌ల సంఖ్యే.
సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే సమయంలో 15 దేశీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కలిపి ఏకంగా 20,000 థియేటర్లలో ఆదిపురుష్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిబట్టి ఆదిపురుష్ పాన్ ఇండియా స్థాయిని దాటేసి పాన్ వరల్డ్ రేంజ్‌కి వెళ్లినట్లు అనిపిస్తోంది కదూ.!