logo

header-ad
header-ad

పోకో సీ3 సేల్ మొదలైంది... ధర రూ.7,000 లోపే

Poco C3 | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.7,000 లోపేనా? పోకో సీ3 సేల్ మొదలైంది. డిస్కౌంట్‌తో రూ.7,000 లోపు ధరకే కొనొచ్చు. ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

1. షావోమీ సబ్‌ బ్రాండ్ అయిన పోకో ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఇటీవల పోకో సీ3 మోడల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఇది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.8,999 ధరకే కొనొచ్చు. 3జీబీ+32జీబీ వేరియంట్‌లో కూడా ఈ ఫోన్ రిలీజైంది. 

2. పోకో సీ3 ప్రత్యేకతలు చూస్తే ట్రిపుల్ రియర్ కెమెరా, హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రారంభ ధర రూ.7,499. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 సందర్భంగా సేల్ మొదలైంది.

3. ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. పోకో సీ3 స్మార్ట్‌ఫోన్‌కు కూడా డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. కాబట్టి 3జీబీ+32జీబీ వేరియంట్‌ను రూ.7,000 లోపు, 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.8,000 లోపు కొనొచ్చు. 

4. ప్రస్తుతం ప్రకటించిన ధరలు ఇంట్రడక్టరీ ఆఫర్ అని చెబుతోంది పోకో ఇండియా. అంటే ఈ ధరలు త్వరలో పెరిగే అవకాశముంది. రాబోయేది దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో సేల్స్ ఉంటాయి. ఈ సేల్ తర్వాత ధర పెరగొచ్చు. 

5. పోకో సీ3 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది

6. పోకో సీ3 రియర్ కెమెరా 13+2+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. 

7. పోకో సీ3 బ్యాటరీ 5000ఎంఏహెచ్. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 

Source: https://telugu.news18.com/photogallery/technology/flipkart-big-billion-days-sale-2020-poco-c3-sale-begins-10-per-cent-discount-on-sbi-credit-and-debit-cards-ss-634144-page-7.html

Leave Your Comment