logo

header-ad
header-ad

‘పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలి’

విశాఖపట్నం : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసేది లాంగ్‌ మార్చ్‌ కాదని.. అది రాంగ్‌ మార్చ్‌ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  నాయుడు ట్రాప్‌లో ఉన్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ పూర్తిగా చంద్రబాబు కంట్రోల్‌లోకి వెళ్లిపోయాడని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌లు కలిసి తెరవెనుక రాజకీయాలు చేశారని.. ఇప్పడు బహిరంగంగా కలిసి రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

 

చంద్రబాబు తనయుడు లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడని.. పవన్‌కు కేడర్‌ లేదని విమర్శించారు. అందువల్ల పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యే మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే స్పందించని పవన్‌.. ఇప్పుడు రోడ్డెక్కడం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. 

Source: akshi.com/news/politics/avanthi-srinivas-slams-pawan-kalyan-1237175

Leave Your Comment