logo

header-ad
header-ad

ముగిసిన లాంగ్ మార్చ్.. పవన్ సభలో కలకలం

ఇసుక కొరత నిరసిస్తూ.. విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ను నిర్వహించారు.  విశాఖలోని మద్దిలపాలెం నుంచి ర్యాలీగా బయలుదేరి...గాంధీ విగ్రహం వరకు లాంగ్ మార్చ్ జరిగింది.  వేలాదిమంది జనసేన, టీడీపీ కార్యకర్తలు ఈ మార్చ్ లో పాల్గొన్నారు.  తెలుగుదేశం పార్టీ తరపున టీడీపీ సీనియర్ నేతలు అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.  

లాంగ్ మార్చ్ తరువాత పాత జైలు ఎదురుగా ఈ సభను ఏర్పాటు చేశారు.  సభ ప్రారంభమైన కొద్దిసేపటికి సభలో కలకలం రేగింది.  సభ వద్ద ఏర్పాటు చేసిన జనరేటర్ నుంచి షార్ట్ సర్క్యూట్ కావడంతో.. ఇద్దరు గాయపడ్డారు.  వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.  ఇసుక కొరతకు నిరసనగా జరుగుతున్న సభలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం విషాదకరం. 

Source: https://www.ntvtelugu.com/post/short-circuit-in-pawan-kalyan-long-march-public-meeting

Leave Your Comment