logo

header-ad
header-ad

అధికారికంగా పవన్ సినీ రీఎంట్రీ ఖాయమే…!

గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ మరలా సినిమా చేయనున్నారని అటు సినీవర్గాలలో ఇటు రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తున్న చర్చ. ఐతే అనేక పుకార్లు వస్తున్నప్పటికీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఆయన సినీ పునర్ అరంగేట్రం పై సందిగ్దత నెలకొంది. ఐతే పవన్ మూవీ చేయండం దాదాపుగా ఖరారైంది. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. నానితో ఎం సి ఏ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోగా,బోని కపూర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం.

కాగా ఈ చిత్రానికి మాటలు పవన్ మిత్రుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉన్నారు. రేపు విశాఖ వేదికగా ఆయన ఏపీలో ఇసుక కొరత గురించి ర్యాలీ చేయనున్నారు. కాగా తదుపరి అసెంబ్లీ ఎలక్షన్స్ కి చాలా సమయం ఉన్న తరుణంలో తన పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడే విధంగా సోషల్ మెస్సేజ్ ఉండే చిత్రాలలో పవన్ నటించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఏదిఏమైనా అధికారిక ప్రకటన ఇంకా రావాల్సివుంది.

Source: https://www.123telugu.com/telugu/news/officially-this-would-be-the-pawans-come-back-movie.html

Leave Your Comment