logo

header-ad
header-ad

కరోనా రోగితో నర్స్ శృంగారం

కరోనా కల్లోలంలో అందరూ షేక్ హ్యాండ్స్ హగ్గులు ఇచ్చుకునేందుకు భయపడుతున్న పరిస్థితి. ఈ టైంలో అపరిచితులతో శృంగారం మొత్తం ఔత్సాహికులంతా బంద్ చేశారు. మహమ్మారి వైరస్ సోకకుండా అందరూ జాగ్రత్తలు పడుతున్నారు.

వైరస్ గురించి అవగాహన లేని వాళ్లు శృంగారం విషయంలో నియమాలు పాటించడం లేదు. అయితే వైరస్ గురించి తెలిసి కూడా ఓ నర్స్ దారుణానికి పాల్పడింది. ఇండోనేషియా దేశంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.

కరోనా నిబంధనలకు తిలోదకాలిచ్చిన ఓ నర్సు ఏకంగా కరోనా రోగితో శృంగారంలో పాల్గొంది. సదురు కరోనా పేషెంట్ స్వయంగా ఈ విషయాలను ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.దీనికి సంబంధించి వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా అతడు ఫేస్ బుక్ లో షేర్ చేశాడు.

ఇండోనేషియా రాజధాని జకార్తలో విస్మా అట్లెట్ క్వారంటైన్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ నర్సు పీపీఈ కిట్ తొలగించి ఆస్పత్రి వాష్ రూమ్ లో కరోనా రోగితో శృంగారం చేసింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ క్వారంటైన్ లో ఉన్నారు.

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఆ నర్సును అధికారులు సస్పెండ్ చేశారు. వీరిపై పోలీసు కేసు కూడా నమోదైంది. కాగా నర్సుకు కరోనా టెస్ట్ చేయగా.. నెగెటివ్ గా వచ్చిందని అధికారులు తెలిపారు.

Source: https://www.tupaki.com/politicalnews/article/Nurse-romance-with-corona-patient/272319

Leave Your Comment