నేపాల్ లో కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం జరిగింది. నేపాల్ లోని డోల్ఖాలోని దౌరాలి నుంచి రాజధాని కాట్మండు వెళ్తున్న బస్సు సుంకోషి నదిలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 8 మంది మరణించగా.. పలువురు గాయపడినట్టుగా సమాచారం.

Source: https://www.ntvtelugu.com/post/road-accident-in-nepal-and-8-people-died