logo

header-ad
header-ad

చంద్రబాబు నాయుడు పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా రోజుల అనంతరం అమరావతి పర్యటనకు సిద్దం అయ్యారు. అయితే కరోనా వైరస్ విపత్తు నేపద్యం లో హైదరాబాద్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు రాక పట్ల ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పరదేశి అని, అజ్ఞాతవాసి అని, తెలంగాణ రాష్ట్ర నివాసి అని ఘాటు విమర్శలు చేశారు. మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పర్యటన సందర్భంగా స్వాగతం సుస్వాగతం అంటూ సెటైర్స్ వేశారు. అయితే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయం గా మారాయి. సోషల్ మీడియా వేదిక గా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. వల్లభనేని వంశీ వైఖరి పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.

Source: https://www.teluguin.com/news/mla-vallabhaneni-vamsi-comments-on-chandrababu.html

Leave Your Comment