logo

header-ad
header-ad

జగన్‌ వల్లే ఇసుక కొరత..! రోజా షాకింగ్‌ కామెంట్స్..!

ఎమ్మెల్యే రోజా సీఎం జగన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగన్‌ కారణంగానే ఏపీలో ఇసుక కొరత ఏర్పడిందని వ్యాఖ్యానించడంతో.. కాస్త సంశయం నెలకొంది. గత కొంతకాలంగా.. ఏపీలో ఇసుక కొరతపై రగడ మామూలుగా జరగడం లేదు. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడడంతో రాష్ట్ర ప్రజలందరూ అల్లాడుతున్నారు. దీంతో.. ఉపాధి కరువై.. కార్మికులు కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో.. విపక్షాలన్నీ.. వైసీపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నారు.

తాజాగా.. మీడియాతో మాట్లాడిన.. రోజా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చల్లటి పాదం మోపండం వల్లనే.. ఏపీలో.. వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయని.. అందువల్లే రాష్ట్రంలో.. కొద్దిమేర ఇసుక కొరత ఏర్పడిందని.. రోజా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై.. విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. అసలు వాస్తవాలు ఏంటి..? ప్రస్తుతం పరిస్థితి ఏలా ఉంది అనేది తెలుసుకోకుండా.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని రోజా ఫైర్ అయ్యారు. అంతేగాక.. పోరుగు రాష్ట్ర ప్రజలు కూడా.. సీఎం జగన్‌ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని.. అది భరించలేకనే.. చంద్రబాబు ఇలా మతిభ్రమించినట్టు ప్రవర్తిస్తున్నారు రోజా ఆరోపణలు చేశారు.

Source: https://tv9telugu.com/mla-roja-shocking-comments-over-sand-shortage-in-ap-158262.ht

Leave Your Comment