logo

header-ad
header-ad

మీకు తెలుసా? : హిమాలయాలపై విమానాలు ఎందుకు వెళ్లవు..?

మన దేశానికి ఉత్తరాన హిమాలయాలు పెట్టని కోట అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ హిమాలయాల మీదుగా విమానాల రాకపోకలు ఉండవు.. ఈ విషయం మీకు తెలుసా.. మరి ఎందుకు ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వతాలైన హిమాలయాల మీదుగా విమానాలు వెళ్లవు.

ఇందుకు కారణమేంటి.. తెలుసుకుందాం.. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. విమానాల ప్రయాణానికి ఇంధనంతో పాటు గాలిలోని ఆక్సిజన్ చాలా అవసరం. హిమాలయ పర్వతాల మీద గాలి పీడనం చాలా తక్కువ. ఆక్సీజన్ పరిమాణం ఇంకా తక్కువ. అందుకే విమానాల ఇంజిన్లలో ఇంధనం మండేందుకు సరిపడినంత ఆక్సిజన్ దొరకదు.

విమానాలకు ఎప్పటికప్పుడు ఉపగ్రహాల ద్వారా విమానాల్లో ఉన్న కంట్రోల్ టవర్ల ద్వారా సమాచార సంకేతాల సరఫరా జరుగుతూనే ఉండాలి. పైగా అవసరమైతే ఉపగ్రహాల ద్వారా జీపీయస్ ద్వారా దారి ఎటు వెళ్తున్నాయో కచ్చితంగా తెలియాలి. కానీ ఎత్తయిన ఈ పర్వత ప్రాంతాల్లో ఈ వైరస్ సంకేతాలు సరిగ్గా పని చేయవు.

అంతే కాదు.. విమానాలు ఎగిరేందుకు రెక్కల మీదుగా, రెక్కల కిందుగా గాలి వీస్తుండాలి. అప్పుడే విమానం సరిగ్గా ఎగురుతుంది. కానీ.. హిమాలయాల్లో గాలి పీడనం చాలా తక్కువ. అందువల్ల విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే భద్రత రీత్యా హిమాలయాల మీదుగా విమానాలు ప్రయాణించవు.

Source: https://www.apherald.com/Technology/Read/450425/meeku-telusa--himalayalapai-vimanalu-enduku-vellavu--

Leave Your Comment