logo

header-ad
header-ad

మౌస్ ఒకటే.. పనులు బోలెడు

న్యూఢిల్లీ: కంప్యూటర్ పెరిఫరల్స్ తయారీ సంస్థ లాజిటెక్ నుంచి మరో సరికొత్త వైర్‌లెస్ మౌస్ వచ్చేసింది. దీనిపేరు ‘ఎంఎక్స్ ఎనీవేర్ 3’. వీడియో కాల్స్ సమయంలో కెమెరా, మైక్ సెట్టింగ్స్ కోసం మౌస్‌‌లో కస్టమైజ్‌డ్ సైడ్ బటన్స్ ఉన్నాయి. విండోస్, మ్యాక్, క్రోమ్ ఓఎస్, లినక్స్‌ కంప్యూటర్లపై ఇది పనిచేస్తుంది.

అడ్వాన్స్‌డ్ క్రియేటర్లు, డెవలపర్లు, అనలిస్టుల కోసం ‘ఎంఎక్స్ ఎనీవేర్ 3 ఫర్ మ్యాక్’ ను డిజైన్ చేసింది. ‘ఎంఎక్స్ ఎనీవేర్ 3’ ధర రూ. 79.99 డాలర్లు (రూ.5,900). 4,000 డీపీఐ సెన్సార్ ఉన్న దీనిని ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేసేందుకు వీలుగా రూపొందించారు. అలాగే, ఒకేసారి పలు డివైజ్‌లతో కనెక్ట్ కావొచ్చు. లాజిటెక్ ఎంఎక్స్ ఎనీవేర్ 3 మౌస్ సెకనుకు 1000 లైన్స్‌ను స్క్రోల్ చేస్తుంది. 

‘ఎంఎక్స్ ఎనీవేర్ 3’ మూడు రంగులు.. గ్రాఫైట్, పేల్ గ్రే, రోజ్ రంగుల్లో అందుబాటులో ఉంది. ‘ఎంఎక్స్ ఎనీవేర్ 3 ఫర్ మ్యాక్’ మాత్రం పేల్ గ్రే రంగులో అందుబాటులో ఉంది. హ్యాండ్ గాడ్జెట్స్‌కు ఇది చక్కగా సరిపోతుందని లాజిటెక్ పేర్కొంది. యూఎస్‌బీ డాంగిల్ ద్వారా కానీ, బ్లూటూత్ ద్వారా కానీ ఒకేసారి మూడు డివైజ్‌లతో కనెక్ట్ కావొచ్చు. ఇందులో ఏర్పాటు చేసిన యూఎస్‌బీ టైప్-సి క్విక్ చార్జింగ్ వల్ల ఒక్కసారి చార్జ్ చేస్తే 70 రోజులు వాడుకోవచ్చు. నిమిషం చార్జ్ చేస్తే మూడు గంటలు పనిచేస్తుంది.

Source: https://www.andhrajyothy.com/telugunews/logitech-mx-anywhere-3-wireless-mouse-with-customisable-side-buttons-2020092107244363

Leave Your Comment