logo

header-ad
header-ad

లెనోవో K12 స్మార్ట్‌ ఫోన్‌- త్వరలో విడుదల!

  • గతంలో వచ్చిన మోటో E7కు లేటెస్ట్ వెర్షన్‌!
  • ఇప్పటికే చైనాలో విడుదలైన స్మార్ట్‌ ఫోన్‌
  • నవంబర్‌లోనే యూరోపియన్‌ మార్కెట్లలోకి
  • ధర రూ. 11,000లోపు- ఇకపై దేశీ మార్కెట్లలోనూ

ముంబై: చైనీస్‌ టెక్‌ దిగ్గజం లెనోవో.. కే12 బ్రాండుతో దేశీయంగా స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన మోటో ఈ7 మోడల్‌ మొబైల్‌ను ఆధునీకరించి కే12గా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కే12ను యూరోపియన్‌ మార్కెట్లలో లెనోవో విడుదల చేసింది. చైనాలో ఇప్పటికే  కే12 స్మార్ట్‌ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. అయితే చైనీస్‌ మార్కెట్లో విడుదలైన ఫోన్‌ గతంలో విడుదలైన మోటో ఈ7 ప్లస్‌కు ఆధునిక వెర్షన్‌గా టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గత మోటో ఈ7 మోడల్‌ను ఆధునీకరించి విడుదల చేయనున్న కే12 ఫోన్‌ దేశీ మార్కెట్లలో 120 యూరోలు(సుమారు రూ. 10,550)గా ఉండవచ్చని అంచనా. ఫోన్‌కు సంబంధించిన ఇతర టెక్నికల్‌ వివరాల అంచనాలు చూద్దాం..

6.5 అంగుళాల తెర

లెనోవో కే12 స్మార్ట్‌ ఫోన్‌ 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్ టచ్‌ స్ర్నీన్‌ను కలిగి ఉంటుంది. వెనుక 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు.. 2 ఎంపీ మాక్రో స్నాపర్‌, 5 ఎంపీ షూటర్‌తో వెలువడనుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5 ఎంపీ షూటర్‌(కెమెరా)ను ఏర్పాటు చేశారు. మీడియాటెక్‌ హీలియోస్‌ జీ25 చిప్‌సెట్‌తో పనిచేయనుంది. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీతోపాటు.. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 10 వెర్షన్‌లో లభించవచ్చని అంచనా.

Source: https://www.sakshi.com/telugu-news/business/lenovo-may-introduce-k12-smart-phone-india-soon-1333594

Leave Your Comment